గతేడాది సెప్టెంబర్ లో ఘోరప్రమాదానికి గురైన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, రీసెంట్గానే తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.
సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సాయిధరమ్ కు 15వ సినిమా అందుకే, SDT 15 అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు డైరెక్టర్.
తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ను చిత్రబృందం ఒక పోస్టర్ ద్వారా అభిమానులకు తెలియచేసింది. విక్రాంత్ రోణ, కాంతార వంటి కన్నడ బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన అజనీష్ లోక్ నాధ్ SDT 15 కి సాంగ్స్ కంపోజ్ చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు.