విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా ఓరి దేవుడా నుండి నిన్న సాయంత్రం విడుదలైన గుండెల్లోనా అనే రొమాంటిక్ డ్యూయెట్ వీడియో సాంగ్ కు యూట్యూబులో ఇప్పటివరకు 2 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఆలపించిన ఈ పాట తెలుగు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
విక్టరీ వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ మూవీలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ & కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.