ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో కీ రోల్ ను పరిచయం చేసిన కార్తీక్ రాజు "అథర్వ" మూవీటీం

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 12:17 PM

కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "అథర్వ". ఈ సినిమాను మహేష్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నూతలపాటి సుభాష్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి, కల్పిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.


తాజాగా హీరోయిన్ కల్పిక పోషిస్తున్న పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో కల్పిక బబ్లీ అండ్ లవింగ్ గర్ల్ 'ఐరా' పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
 
ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం , కన్నడ భాషలలో త్వరలోనే విడుదల కాబోతుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com