బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 తాజాగా రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ పొన్నియన్ సెల్వన్ 1 సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టు కోలేకపోయిన మిగితా చోట్ల మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా 11వ రోజు 400 కోట్ల గ్రాస్‌ను అందుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగులో ఇప్పటి వరకు 8.68 కోట్ల షేర్‌ను, 16.45 కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్లు తెలిపింది.