కొంచెంసేపటి క్రితమే "బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్" అనే రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యొక్క థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఆల్రెడీ ఒకసారి ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఇప్పుడిది రెండోది అన్నమాట. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో, హార్ట్ టచింగ్ సెంటిమెంటల్ లవ్ తో ఈ తరం యువతీయువకుల ఆలోచన విధానాన్ని, ప్రేమపట్ల వారికున్న అభిప్రాయాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతుంది ఈ సినిమా.
'కేరింత' ఫేమ్ విస్వంత్ దుద్దునపూడి, మాళవిక సతీషన్ కంభంపాటి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, సంతోష్ కంభంపాటి డైరెక్టర్ గా వ్యవహరించారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది.