చండీగఢ్‌కు చెందిన పంజాబీ నటి ఇషా రిఖీతో ప్రముఖ ర్యాపర్, సింగర్ బాద్‌షా డేటింగ్ చేస్తున్నాడు. ఇషా రిఖీని కామన్ ఫ్రెండ్ పార్టీలో సింగర్ బాద్‌షా కలిశాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు పింక్‌విల్లా మ్యాగజైన్ వెల్లడించింది. బాద్‌షా ఇషాలు తమ తమ కుటుంబాలతో తమ బంధం గురించి ఇప్పటికే చెప్పారని వారి సన్నిహితులు వెల్లడించారు. ఏడాదిగా వారు ప్రేమలో విహరిస్తున్నట్లు సినీవర్గాలు కోడై కూస్తున్నాయి.