కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా "సర్దార్". రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్గా నటిస్తున్నారు.
లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీపావళి కానుకగా తమిళంలో అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో కూడా అదే రోజున విడుదల కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. పోతే, తెలుగులో ఈ సినిమాను నాగార్జున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ఖైదీ తరవాత మళ్ళి అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్న కార్తీకి, ఈ సినిమా సూపర్ హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |