పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి సరికొత్తగా రాబోతున్న మరొక పాన్ ఇండియా మూవీ "ఆదిపురుష్". ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్,క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ ఖరీదైన 3డి విజువల్ వండర్ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు చిత్రబృందం. తాజా సమాచారం ప్రకారం, హీరోయిన్ కృతిసనన్ తన పాత్ర డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు కృతి తన ఇన్స్టా స్టోరీ లో డబ్బింగ్ స్క్రిప్ట్ పేపర్స్ ను పెట్టింది.
మరి కొద్దీ రోజుల్లో బిగ్ బ్యాంగ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించిన చిత్రబృందం, ఈ సారైనా ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ పొందాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa