ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో 'కాంతార' సృష్టిస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పవర్ఫుల్ కంటెంట్, అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళంలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ వారంలోనే కాంతార ఇతర భాషలలో థియేటర్లలో విడుదల కాబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, కాంతారా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందట. వచ్చే నెలలో ఒక మంచి రోజు చూసుకుని ప్రైమ్ వీడియో లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి రాబోతుంది.
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం చేసిన ఈ పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa