మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం "గాడ్ ఫాదర్". ఇందులో చిరు, సల్మాన్ కలిసి డాన్స్ స్టెప్స్ వేసే తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ కి థియేటర్లలో ప్రేక్షకుల విజిల్స్ తో మోత మోగిపోయింది.
తాజాగా ఈ పాటను పూర్తి వీడియో రూపంలో మేకర్స్ విడుదల చేసారు. ప్రభుదేవా ఈ సాంగ్ ను డైరెక్ట్ చేసి, సాంగ్ చివరిలో చిరు, సల్మాన్ లతో కలిసి డాన్స్ వేస్తారు. పాటలో ఆ సీన్ ఐతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తమన్ స్వరపరిచిన ఈ పాటను శ్రేయాఘోషల్ ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.
పోతే, మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సీరియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో నయనతార, సత్యదేవ్, సునీల్, షఫీ, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషించారు.