1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించిన పూజా హెగ్డే నేడు 32వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా పూజకు బర్త్ డే విషెస్ ను తెలియచేస్తున్నారు.
మోడల్ గా ప్రొఫెషనల్ లైఫ్ ను స్టార్ట్ చేసిన పూజా ఆపై మిస్ యూనివర్స్ ఇండియా పీజెంట్ రేస్ లో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. 2012 లో తమిళంలో చేసిన మూగమూడి సినిమాతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన పూజా ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి డిబట్ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీ డీసెంట్ హిట్ కొట్టింది.
ఇక తెలుగులో పూజకి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముకుందా, దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గడ్డలకొండ గణేష్, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి బిగ్ ప్రాజెక్ట్ లో పూజ హీరోయిన్ గా నటించింది.