ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి "పుష్ప" సినిమా ఎన్నో అవార్డులను, రివార్డులను, ముఖ్యంగా పాన్ ఇండియా క్రేజ్ ను గ్రాండ్ గా కట్టబెట్టింది. ఈ ఒక్క సినిమాతో బన్నీ ఇప్పటివరకు సైమా, ఫిలింఫేర్ వంటి బిగ్ అవార్డులను అందుకోగా, తాజాగా CNN న్యూస్ 18వారు అందించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకుని, ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ హీరోగా ఐకాన్ స్టార్ రికార్డు క్రియేట్ చేసాడు.
స్మృతి ఇరానిగారు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బన్నీ కి అందించారు. తదుపరి బన్నీ మాట్లాడుతూ ఈ అవార్డును కోవిద్ సమయంలో కష్టపడి పనిచేసిన డాక్టర్లు, నర్సులు, తదితరులకు అంకితం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.