రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ మూవీ నుండి హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ బ్రేకప్ సాంగ్ వీడియో విడుదలైంది. హీరోహీరోయిన్ల మధ్య ఏదో గొడవ జరిగి ఆపై ఇద్దరూ బాధపడుతున్న సిట్యుయేషన్ లో వచ్చే ఈ పాటను రేవంత్, చిన్మయి శ్రీపాద ఆలపించగా, రెహ్మాన్ సాహిత్యమందించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.
విశ్వంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది నిర్మిస్తున్నారు.