తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న కృతిశెట్టికి మరో ఆఫర్ వచ్చింది. త్వరలో కృతి మలయాళ పరిశ్రమలోకి అడుగుపెట్టనుంది. టోవినో థామస్‌కి జోడీగా 'అజయంతే రందం మోషణం' సినిమాలో నటిస్తోంది. 3డిలో వస్తున్న ఈ చిత్రానికి జితిన్‌లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టితో పాటు ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు తమిళ హీరో సూర్యతో కృతి ఓ సినిమా చేస్తోంది.