ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే స్ట్రీమింగ్ కి రాబోతున్న ఆడియన్స్ హాట్ ఫేవరెట్ బాలయ్య టాక్ షో

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 09:47 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 రేపు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఐతే, రేపు ఏ సమయంలో ఈ షో స్ట్రీమింగ్ కు రాబోతుందో మేకర్స్ టైం ఎనౌన్స్ చేస్తూ, స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. దీని ప్రకారం, రేపు మధ్యాహ్నం 02:13 నిమిషాలకు ఈ షో డిజిటల్ ప్రీమియర్ కానుంది.


ఫస్ట్ ఎపిసోడ్ కు తెలుగు దేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా హాజరై, పొలిటికల్, పర్సనల్ విషయాలపై ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ మేరకు విడుదలైన ప్రోమో ఫస్ట్ ఎపిసోడ్ పై అంచనాలను ఏర్పరిచింది. విశేషమేంటంటే, బాలయ్య అల్లుడు, చంద్రబాబు గారి ఏకైక పుత్రుడు లోకేష్ కూడా ఈ షోలో మెరవనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com