దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన సినిమా 'అహింస'. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో గీతిక తివారి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'కమ్మగుంటదే పిల్లా' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు చిత్ర బృందం. పూర్తి పాటని ఈనెల 15న హీరో నాని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించారు.