పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం "ఆదిపురుష్" గురించి ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. టీజర్ రిలీజైన తదుపరి మరికాస్త ఎక్కువగానే ఆదిపురుష్ మూవీ వార్తల్లో నిలుస్తూ వస్తుంది.
రీసెంట్గానే ఈ మూవీ కి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసిన హీరోయిన్ కృతిసనన్ ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఐతే, తాజాగా ఈ సినిమాపై మరొక కొత్త విషయం తెలుస్తుంది అదేంటంటే, అక్టోబర్ 19 నుండి ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవబోతున్నారట. ఆదిపురుష్ టీం ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.
ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్గా నటించారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.