ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 'అలై బలయ్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమంలో చిరంజీవిపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవక్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను గరికపాటి, చిరంజీవి లైట్ తీసుకున్నప్పటికీ ఈ విషయంలో మెగా అభిమానులు, సినీరంగంలోని కొందరు పెద్ద ఎత్తున గరికపాటిపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'ఆయన పెద్దాయన.. ఆయన వ్యాఖ్యలపై చర్చ అనవసరం' అని అన్నారు.