హరిహర వీరమల్లు సినిమాతో గ్రాండ్ పాన్ ఇండియా డిబట్ ఎంట్రీ ఇవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల అనుకున్న సమయానికి అనుకున్న సినిమాలు చెయ్యలేకపోతున్నాడు. దీంతో హరిహర వీరమల్లు లేట్ అవుతూ వస్తుంది. ఇది లేట్ అవ్వడం వల్ల హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ కాలేదు.
క్రిష్, హరీష్ శంకర్, సముద్రఖని... ఈ డైరెక్టర్లను పక్కనపెడితే, పవన్ హిట్ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబును "సర్కారువారిపాట" లో స్టైలిష్ మాస్ యాక్షన్ హీరోగా చూపించిన పరశురామ్ పెట్ల కూడా వచ్చి చేరారని తెలుస్తుంది. BVSN ప్రసాద్ , పవర్ స్టార్ తో నిర్మించబోయే ఒక సినిమాకు పరశురామ్ దర్శకుడని తెలుస్తుంది. త్వరలోనే పరశురామ్ పవన్ కు స్క్రిప్ట్ కూడా వినిపించడానికి రెడీ అవుతున్నారట. మరైతే, ఈ విషయాలలో పూర్తి క్లారిటీ రావలసి ఉంది.