సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాను (SSMB 28) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబోపై ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన అంచనాలుండడంతో మొదటి నుండి కూడా ఈ సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ లో స్టార్ట్ ఐన ఈ మూవీ తొలి షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని, సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చెయ్యడానికి ప్రిపేర్ అవుతుండగా, మహేష్ మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు మరణించారు. దీనితో సెకండ్ షెడ్యూల్ కాస్త ఆలస్యమవ్వొచ్చని ముందుగానే ప్రచారం జరిగింది ఈ మేరకు నవంబర్ మొదటి వారంలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ కు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈలోపు మహేష్ తన పర్సనల్ పనిమీద విదేశాలకు వెళ్లి రావాలనుకుంటున్నాడట.