అక్కినేని నాగచైతన్య, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
రామోజీ ఫిలింసిటిలో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం కర్ణాటకలో సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటున్న ఈ మూవీ నుండి రేపు ఉదయం 09:46 నిమిషాల నుండి క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయని మేకర్స్ తెలిపారు.
నాగచైతన్య కెరీర్ లో 22వ సినిమాగా చిత్రీకరించబడుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.