నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాకు సంబంధించిన టైటిల్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. జై బాలయ్య, అన్నగారు, రెడ్డి గారు... ఇలాంటి ఎన్నో ఇంటెన్స్ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కానీ తాజాగా ఈ టైటిల్ రేసులోకి 'వీరసింహారెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ టైటిల్ వచ్చి చేరినట్టు తెలుస్తుంది. ఈ టైటిల్ నే NBK 107 కు లాక్ చేసారని వినికిడి. మరి, ఈ విషయంలో మేకర్స్ నుండి దీపావళికి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.