కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి తెలుగు డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి 'నేను ఎవరు?' అనే పాట ప్రోమోని రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ పూర్తి పాటను ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది.ఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 21న రిలీజ్ కాబోతుంది.