మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో చెయ్యబోయే సినిమా ఇకపై ఉండదని తెలుస్తుంది. రీసెంట్ మీడియా ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవినే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
నాగశౌర్య, రష్మిక మండన్నా జంటగా నటించిన "ఛలో" చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ వెంటనే నితిన్ తో చేసిన "భీష్మ" సినిమా కూడా డీసెంట్ హిట్ అయ్యింది. తదుపరి మెగాస్టార్ కి ఒక స్టోరీ లైన్ ను వినిపించి, ఆయన తో సినిమాను ఫిక్స్ చేసుకున్న కుడుముల, అందుకోసం రెండేళ్ల బట్టి నిరీక్షిస్తూ వచ్చారు.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా లేదని తెలిసాక మరి వెంకీ కుడుముల ఎవరితో సినిమా తీస్తారు? అనే ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.