యువనటుడు సందీప్ కిషన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "మైఖేల్" ఎప్పటి నుండో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఒక్క టైటిల్ పోస్టర్ తప్పించి ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 20వ తేదీన మైఖేల్ టీజర్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.
కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డైరెక్టర్ కం యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తుండగా, 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. రంజిత్ జయకుడి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.