రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ ‘అహింస’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బలమైన..భిన్నమైన కథా చిత్రాలను అందిస్తుందనే బ్యానర్‌కు మంచి పేరుంది. అలాంటి బ్యానర్‌పై రూపొందిన సినిమా ఇది. ఈ సినిమాలో అభిరామ్ జోడి సరసన గీతిక తివారీ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమాలోని ‘కమ్మగుండె పిల్ల’ పాట ప్రోమోను విడుదల చేశారు.