మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలానే మెగా 154 షూటింగ్ లోను పాల్గొంటున్నారు. గాడ్ ఫాదర్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే విషయంపై స్పందించారు.
పవన్ తో సినిమా చెయ్యాలనే సరదా నాకూ , నాతో సినిమా చెయ్యాలనే ఉత్సుకత పవన్ కి తప్పకుండా ఉంటుంది. పక్కా స్క్రిప్ట్ సెట్ అయ్యి, అన్ని కుదిరితే, మా ఇద్దరి కాంబోలో మూవీ తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ... అని మెగాస్టార్ చెప్పడంతో, మెగా అభిమానులు ఫుల్ ఎక్జయిట్ అవుతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ కాంబో తెరపైన కనబడితే, ఇంకేమన్నా ఉంటదా... ఇరు తెలుగు రాష్ట్రాల థియేటర్లు ప్రేక్షకుల విజిల్స్ తో మోతెక్కిపోవూ ..!!