నారా రోహిత్ తో "రౌడీ ఫెలో" సినిమా తెరకెక్కించి డైరెక్టర్ గా మారారు లిరిసిస్ట్ కృష్ణ చైతన్య. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే, ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో యంగ్ హీరో నితిన్ కృష్ణ చైతన్య కు ఛాన్స్ ఇచ్చి, "చల్ మోహన్ రంగా" సినిమా చేసాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను ఏమంత ఆకట్టుకోలేదు.
కృష్ణ చైతన్య మరొక యంగ్ హీరో శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమక్షంలో కృష్ణ చైతన్య డైరెక్టర్ గా, శర్వానంద్ హీరోగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఎనౌన్స్ చేయబడ్డ ఈ మూవీ తాజాగా క్యాన్సిల్ అయ్యినట్టు ఇండస్ట్రీ టాక్. స్క్రిప్ట్ విషయంలో రాజీ పడని శర్వా కృష్ణ చైతన్య సినిమాను పక్కన పెట్టాలని అనుకుంటున్నారట.