మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబోలో వచ్చిన "ఆచార్య", భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరపరాజయం పాలైన విషయం తెలిసిందే.
తాజాగా ఆచార్య డిజాస్టర్ పై మెగాస్టార్ పెదవి విప్పారు. ఆచార్య ఫెయిల్యూర్ నుండి బయ్యర్లను కాపాడేందుకు నేను చెయ్యాల్సిన ధర్మం చేశాను. చేసింది చెప్పుకుంటే చిన్నదైపోతుంది. భారీ మొత్తాన్ని నాది కాదని నేనే కాదు చరణ్ కూడా వదిలేసుకున్నారు. నేను వదులుకోవడం వల్ల బయ్యర్లు నష్టాల నుండి రిలీఫ్ అవుతారన్న తృప్తి.. ఆచార్య ఫ్లాప్ నుండి నన్ను కుంగిపోకుండా చేసింది ... అంటూ మెగాస్టార్ ఓపెన్ అయ్యారు.
కొరటాల శివ డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.