కోవిడ్ పండెమిక్ తదుపరి యాక్టర్ సోనూసూద్ పేరు జనాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. సినిమాల్లో క్రూరమైన విలన్ గా నటించే సోనూసూద్ రియల్ లైఫ్ లో వెన్న కన్నా సున్నితమైన మనసు కలవాడు. కరోనా టైం లో ఎంతో మందికి ఎన్నోరకాలుగా సహాయం చేసి, తన దాతృత్వాన్ని చాటుకున్నాడు.
ఆపై కూడా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ, జనాల్లో మోడరన్ కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సోనూసూద్ చేసిన, చేస్తున్న సేవాకార్యక్రమాలకు గానూ CNN న్యూస్ 18 సంస్థ తమ ప్రెస్టీజియస్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఆయనను సత్కరించింది. స్పెషల్ అచీవ్మెంట్ క్యాటగిరిలో సోను ఈ అవార్డును అందుకున్నారు. CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంటర్టైన్మెంట్ అవార్డును ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అందుకున్న విషయం తెలిసిందే.