'బంగార్రాజు' తదుపరి యువ నటీనటులు నాగచైతన్య, కృతిశెట్టి మరొక సినిమాలో జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.
నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి ఈ సినిమాలో భాగం అని ప్రకటించిన మేకర్స్ మరో ఇద్దరు నటులను కూడా ఈ సినిమాలోకి ఆహ్వానిస్తూ, అధికారిక ప్రకటన చేసారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో విలన్, సపోర్టింగ్ రోల్స్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సంపత్ రాజ్ మరియు వెంకట్ ప్రభు బ్రదర్ ప్రేమ్ జీ అమరేన్ లు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.