ఇండియన్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం గారు ఆయన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా నుండి చోళుల వీరత్వాన్ని, శూరత్వాన్ని, ఘనచరితను తెలిపే చోళ చోళ పూర్తి వీడియో సాంగ్ విడుదలైంది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను సీనియర్ సింగర్ మనో, అనురాగ్ కులకర్ణి తో కలిసి ఆలపించారు. అనంతశ్రీరాం సాహిత్యం అందించారు.
పోతే, ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్ తదితరులు నటించారు.