హీరో సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియన్ మూవీ "మైఖేల్"తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజా వార్త ఏమిటంటే, మైఖేల్ టీజర్‌ను అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి, మేకర్స్ కొత్త రొమాంటిక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.