బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమాలో నటించిన విషయం తెలిసిందే. భారతీయ పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా చిత్రీకరించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు.
ఓం రౌత్ గత చిత్రం "తన్హాజి" నేషనల్ అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ లీడ్ రోల్ లో నటించారు. తన్హాజి చిత్రంతో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ అనుబంధంతో ఆదిపురుష్ చిత్రాన్ని అజయ్ దేవగణ్ కు చూపించి, ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకుందామని ఈ వీకెండ్ కి స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారట ఓం రౌత్.
మరి, అజయ్ ఆదిపురుష్ కి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారని అంతటా ఆసక్తి నెలకొంది.