మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు వచ్చాయి. ఆచార్య బిగ్ డిజాస్టర్ ఐతే, ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ ఘనవిజయం దిశగా దూసుకెళ్తుంది.
త్వరలోనే మెగాస్టార్ నుండి మరొక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. కె ఎస్ రవీంద్ర డైరెక్షన్లో చిరు నటిస్తున్న "మెగా 154" వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుందని తెలుసు కదా. ఈ మేరకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీ రోల్ ప్లే చేస్తున్నారని మేకర్స్ అధికారిక ప్రకటన చేసినప్పటి నుండి ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.
తాజాగా ఈ సినిమాలో రవితేజ పోషిస్తున్న రోల్ కి సంబంధించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో వీరవిహారం చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో రవితేజ "వైజాగ్ రంగరాజు" అనే ఔటండౌట్ మాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారట. రవితేజకు అన్నయ్యగా,"వాల్తేరు వీరయ్య" పాత్రలో మెగాస్టార్ ఊరమాస్ యాక్టింగ్ చెయ్యనున్నారట. ఇంకా అఫీషియల్ గా టైటిల్ లాక్ అవ్వని ఈ సినిమాపై వినిపిస్తున్న ఈ వార్తలపై మరింత క్లారిటీ రావలసి ఉంది.