ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NC 22 : చైతూతో స్క్రీన్ షేర్ చేసుకోనున్న స్టార్స్ వీళ్ళే..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 07:21 PM

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య హీరోగా ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.


ఈ మూవీలో నటించబోయే నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటిస్తూ, ఈ రోజు మొత్తం ఎక్జయిటింగ్ అప్డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఈ సినిమాలో నటించబోయే భారీ స్టార్ క్యాస్ట్ ఏదంటే.... అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్ జి అమరేన్, ప్రేమి విశ్వనాధ్. ఈ అమేజింగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందంటూ చైతు కామెంట్ చేసాడు.


శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిమిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa