అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఉర్వశివో రాక్షసివో". ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ నాల్గవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ లతో యూత్ ఆడియెన్స్ లో మంచి అంచనాలను ఏర్పరుచుకున్న ఈ మూవీ నుండి అక్టోబర్ 17వ తేదీన సెకండ్ లిరికల్ సాంగ్ 'మాయారే' రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa