ఎన్టీఆర్ బయోపిక్ నుండి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ వున్న పోస్టర్ ను విడుదల చేశారు. బసవతారకం హార్మోనియం వాయిస్తూ వుంటే, ఆ పక్కనే ఎన్టీఆర్ కూర్చుని ఆమె కళ్లలోకి చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్, ఎన్టీఆర్ .. బసవతారకం దంపతుల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా ఆడియో వేడుకను హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ఆరంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa