సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు నయనతార-విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులు అవడం దుమారం రేపింది. పెళ్లైన 4 నెలలకే సరోగసీ ద్వారా పిల్లలను కనడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీకి నయన్ దంపతులు తాజాగా స్పష్టత ఇచ్చారు. తాము 6 ఏళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి, దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. తాజా ట్విస్ట్‌తో వివాదానికి ముగింపు పలికినట్లైంది.