టాలీవుడ్ జక్కన్న డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించే రోజు ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ అభిమానుల కోరిక తీరే రోజు అతి త్వరలోనే రాబోతుందన్న గుడ్ న్యూస్ చెప్పారు రచయిత విజయేంద్రప్రసాద్ గారు. అంతేకాక ఈ ప్రాజెక్ట్ పై కీలక సమాచారాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అదేంటంటే, SSMB 29 కథా విషయానికొచ్చేసరికి, ఒక నిజజీవిత ఘటన ఆధారంగా తీస్తున్న సినిమా ఇదని, ఈ స్టోరీ లైన్ కు యాక్షన్ అడ్వెంచర్ ను బ్యాక్ డ్రాప్ గా పెడుతున్నామని, అలానే వచ్చే ఏడాది ప్రథమార్ధానికి ఈ మూవీ సెట్స్పైకి వెళ్తుందని ఒక బాలీవుడ్ మీడియాకు విజయేంద్రప్రసాద్ గారు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.