కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "వారిసు" తెలుగులో "వారసుడు". వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు కాగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
చాలా శాతం వరకు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ రాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అక్టోబర్ 23 వ తేదీన వారసుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుందట. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందట.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.