ఇండియాస్ బ్లాక్ బస్టర్ హిట్ RRR ఈ నెలలో జపాన్ వాసులను అలరించడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జపాన్ లో తమ సినిమాకు వీలైనంత ఎక్కువ పాపులారిటీని తీసుకొచ్చేందుకు స్వయంగా RRR త్రయం డైరెక్టర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తేజ లు కలిసి జపాన్ కి బయలుదేరారు.
ఈ మేరకు ఉపాసన, పెట్ డాగ్ రైమ్ తో కలిసి చెర్రీ ఎయిర్పోర్టు లో ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఉపాసన చెర్రీతో వెళ్తుందో, లేక సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లిందో లేదో తెలియదు కానీ, సోషల్ మీడియా సమాచారం మేరకు RRR ప్రమోషన్స్ నిమిత్తం జక్కన్న, తారక్, చెర్రీ కలిసి జపాన్ కి బయలుదేరి వెళ్తున్నారు.