'స్వాతిముత్యం' తో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన బెల్లంకొండ వారసుడు గణేష్ ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న రెండవ సినిమా "నేను స్టూడెంట్ సర్".
ఈ సినిమాతో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతికా దస్సాని టాలీవుడ్ రంగప్రవేశం చేస్తుంది. హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన మేకర్స్ తాజాగా కీలకపాత్రను పోషిస్తున్న సముద్రఖని ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. పోస్టర్ ను బట్టి ఇందులో సముద్రఖని "అర్జున్ వాసుదేవన్" అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు రాఖీ ఉప్పలపాటి డైరెక్టర్ కాగా, నాంది సతీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మహతీస్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.