తలపతి విజయ్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా "వారిసు". వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఫీల్ గుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగులో "వారసుడు" గా రాబోతుంది.
తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమా లో ఒక పాటకు విజయ్ తన గొంతును సవరించుకున్నాడట. విజయ్ పాడిన ఆ పాటనే దివాళి కానుకగా అక్టోబర్ 23వ తేదీన విడుదల చెయ్యడానికి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారట. జోనితాగాంధీ తో కలిసి విజయ్ పాడిన ఈ పాట ఇరు భాషల ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగబోతుంది.