నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ శ్రీలీల కు బాలయ్య తండ్రిగా నటిస్తున్నారని చెప్పి ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తిని కలిగించారు అనిల్.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇన్నాళ్లు వేటాడిన అనిల్ ఇక లాభం లేదని బాలీవుడ్ బాట పట్టారంట. అంటే ఒక బాలీవుడ్ నటి ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించబోతుందన్న మాట. అలానే విలన్ రోల్ కోసం కూడా బాలీవుడ్ నటుడిని ఎన్నుకోవాలని అనిల్ ఆలోచిస్తున్నారట. మరి, ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే చాలా సమయమే పట్టేటట్లుంది. అప్పటివరకు ఎదురుచూపులు తప్పవన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa