ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు గణేష్ హీరోగా పరిచయమైన చిత్రం "స్వాతిముత్యం". దసరా కానుకగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది.
డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఆహా ఓటిటిలో ఈ నెల 28 నుండి స్వాతిముత్యం స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది. ఈమేరకు కొంచెంసేపటి క్రితమే ఆహా సంస్థ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
ఈ సినిమాతో లక్షణ్ కే కృష్ణ డైరెక్టర్ గా పరిచయమయ్యారు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ గణేష్ కు జోడిగా నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa