మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్-1' వసూళ్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే రూ.450 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. 2022లోనే విడుదలైన కమల్ హాసన్ 'విక్రమ్', రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ' సినిమా వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు.