తెలుగు ఓటిటి ఆహాలో అక్టోబర్ 28 నుండి స్వాతిముత్యం సినిమా డిజిటల్ ప్రీమియర్ కావలసి ఉంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కానీ, ప్రేక్షకుల కోరిక మేరకు ఈ డేట్ ను కాస్త ముందుకు జరిపినట్టు నిన్న ఆహా సంస్థ సరికొత్త ప్రకటన చేసింది. దీని ప్రకారం, అక్టోబర్ 24 నుండి స్వాతిముత్యం డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో విడుదలై డీసెంట్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు, విమర్శకులు ఈ సినిమాకు చాలా మంచి రివ్యూలను ఇచ్చారు. దసరాకు విడుదలైన ఈ సినిమా దీపావళికి డిజిటల్ లోకి వచ్చేయడం విశేషం.
లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.