రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గురువారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన నటి మరియు ఫెమినా మిస్ ఇండియా సుభ శ్రీ రాయగురు. ఈ సందర్భంగా సుభ శ్రీ రాయగురు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ రోజు మొక్కలు నాటడమే కాదు సందర్బం వచ్చినప్పుడల్లా మరిన్ని మొక్కలు నాటి సంరక్షిస్థానని అన్నారు.
ఈ ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనము కూడా తిరిగి ఎంతో అంత ఇవ్వాల్సిన భాద్యత లో భాగంగా మొక్కలు నాటి మంచి వాతావరనాన్ని కల్పించే అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మణ్ రావు రుద్ర వీణ మూవీ ప్రొడ్యూజర్, శ్రీరామ్ మల్ల, రఘు కుంచె వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.