అర్జున్ రెడ్డి, గీత గోవిందం హీరో, యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కపిల్ దేవ్ బయోపిక్‌లో నటించనున్నట్టు సమాచారం. ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్‌ను దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ''83'' అనే టైటిల్‌ను ఖరారు చేసారు కూడా. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తుండగా, కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథలో కీలకం కావడంతో ఆ పాత్రలో విజయ్ దేవరకొండను నటింపజేయాలని దర్శకుడు కబీర్ ఖాన్ భావించి ఈమేరకు విజయ్‌ని సప్రదించడం, అందుకు ఆయన అంగీకరించడం జరిగిపోయాయట. 2020లో సినిమా విడుదలయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa